కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఎన్‌సీసీ సూపరింటెండెంట్
ఆంధ్రప్రదేశ్ ఎన్‌సీసీ డిపార్టుమెంట్‌లో సూపరింటెండెంటుగా పనిచేస్తున్న కారుముడి విజయలక్ష్మి (60) కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన భవానీ ఐలాండ్ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. విజయలక్ష్మి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ప్రాథమిక విచారణలో వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు…
