పాలకొండ రవీంద్రభారతి పాఠశాలలో సైన్స్ ఎక్స్పో ఘనంగా
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ రవీంద్రభారతి పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సైన్స్ ఎక్స్పో అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీయడం, శాస్త్రీయ అవగాహన పెంపొందించడం లక్ష్యంగా యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు, నమూనాలు పాఠశాల ఆవరణలో ప్రదర్శించగా, అవి అటువంటి ప్రయోగాత్మక విద్యకు నిదర్శనంగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ డీఈఓ పి. కృష్ణమూర్తి మాట్లాడుతూ, శాస్త్రీయ పరిశోధనలు, అవగాహన పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని…
