విజయనగరం టీడీపీ సమావేశంలో కీలక చర్చలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సూచనల ప్రకారం విజయనగరంలో పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో జరిగిన ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు కుటుంబ సాధికార సారధులను నియమించడం, బూత్ కన్వీనర్లు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటుచేయడం వంటి…
