తిరుమల అన్నప్రసాదంలో కొత్తగా వడలు – టీటీడీ ప్రకటన
తిరుమలలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద సేవలో కొత్తగా వడలను కూడా చేర్చారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా ప్రకటించారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అన్నప్రసాద మెనూలో అదనంగా కొత్త పదార్థాన్ని చేర్చాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆమోదంతో వడలను వడ్డించాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు వడలను వడ్డిస్తామని…
