విజయవాడలో బీఎస్ఎన్ఎల్ 4జీ ప్రారంభం – అమరావతిలో తొలి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటును ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడలో శనివారం బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ సేవలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, బీఎస్ఎన్ఎల్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్వాంటం మిషన్‌ను ముందుకు…
