GEO representatives urge donors to support poor students’ education, citing financial struggles that may hinder their academic future.

పేద విద్యార్థుల చదువుకు దాతల సహాయం అవసరం!

పేద విద్యార్థుల చదువుకు సహాయంగా దాతలు ముందుకు రావాలని గ్లోబల్ ఎంపవర్‌మెంట్ ఆర్గనైజేషన్ (GEO) ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గురువారం నగరంలోని 80 అడుగుల రోడ్డులోని V-1 రెస్టారెంట్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 2022లో పేద విద్యార్థులకు విద్యాబలం కల్పించాలనే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించామని, ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులను కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించి విద్య అందించామని తెలిపారు. సంస్థ ద్వారా ఇప్పటివరకు 32 మంది విద్యార్థులకు చదువు కల్పించామని, అయితే ప్రస్తుతం…

Read More
Loksatta leader Bishetti Babji urges the government to create 10,000 jobs for youth at the upcoming Vizianagaram Airport.

విజయనగరం ఎయిర్ పోర్ట్‌లో యువతకు ఉపాధి కల్పించాలి!

విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు కానున్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ను యువతకు ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుని, ఎయిర్ పోర్ట్‌లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో పాటు దానిలో పనిచేసేందుకు కనీసం 10,000 మంది ఉద్యోగావకాశాలు లభించేలా…

Read More
As part of Women's Day celebrations, Vetapalem SI Venkateswarlu conducted an awareness program on women's empowerment and safety.

టపాలెం ఎస్సై ఆధ్వర్యంలో మహిళా సాధికారత అవగాహన!

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు వేటపాలెం ఎస్సై ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో S.t Ann’s College నందు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత (Women Empowerment) మరియు మహిళా భద్రత (Women Safety) అంశాలపై ప్రత్యేక వీడియోల ప్రదర్శన జరిగింది. విద్యార్థినులకు, మహిళా సాధికారత ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్సై వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న నేరాలు, మోసాల…

Read More
Borugadda Anil, who secured interim bail using a fake medical certificate, is on the run. Police intensify their search.

బోరుగడ్డ అనిల్ కోసం అనంతపురం పోలీసుల గాలింపు!

తల్లి అనారోగ్యం అని చెబుతూ డాక్టర్ సర్టిఫికేట్‌ను సమర్పించి హైకోర్టులో మధ్యంతర బెయిల్ తీసుకున్న బోరుగడ్డ అనిల్ కోసం అనంతపురం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అనిల్ చెన్నై ఆసుపత్రికి వెళ్లాడా లేదా అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. అందుకు సంబంధించి అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నారు. పోలీసుల విచారణలో అనిల్ సమర్పించిన డాక్టర్ సర్టిఫికేట్ ఫేక్ అని గుర్తించారు. దీంతో అతను తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును మోసం చేసినట్టు తేలింది. అతని తల్లి ఆస్పత్రిలో…

Read More
Minister Sandhya Rani clarified that free bus travel for women is limited to their respective districts and does not apply for inter-district travel.

ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సంధ్యారాణి స్పష్టత!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించనున్నట్టు తెలిపారు. అయితే, ఇది ఒక్కో జిల్లాలోని మహిళలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఒక జిల్లా మహిళలు మరో జిల్లాకు ఉచిత ప్రయాణం చేయలేరని తేల్చిచెప్పారు. ఈ అంశంపై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం స్పష్టతనిస్తున్నట్టు మంత్రి తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ…

Read More
Foundation stone laid for Chirala JanaSena office. Amanchi Swamulu announced completion within a month.

చీరాల జనసేన పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన

చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ అధికారిక కార్యాలయానికి 6/3/25 గురువారం శంకుస్థాపన జరిగింది. వేటపాలెం బైపాస్ రోడ్‌లోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం సమీపంలో ఈ కార్యాలయానికి రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు, యువ నాయకుడు ఆమంచి రాజేంద్ర ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ఈ కార్యాలయం నెల రోజుల్లో పూర్తి చేయనున్నట్లు ఆమంచి స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ (మాల) కార్పొరేషన్…

Read More
AIYF demands action against the medical mafia in Srikakulam and urges the government to conduct Mega DSC for unemployed youth.

శ్రీకాకుళంలో మెడికల్ మాఫియా పెరుగుతోంది – ఏఐవైఎఫ్ ఆందోళన

శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ మాఫియా పెరిగిపోతుందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, జిల్లా నాయకులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావులు ఆరోపించారు. నరసన్నపేటలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆర్‌ఎంపీ నుంచి ఎండి డాక్టర్ల వరకు అధిక ఫీజులు, అవాంఛిత స్కానింగ్‌లు, టెస్టుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘిస్తూ నోటీసు బోర్డులు పెట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ,…

Read More