జీడిమామిడి రైతుల రక్షణకు ప్రభుత్వ మద్దతు కావాలి
పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో సాగవుతున్న జీడిమామిడి పంట రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 10న కురుపాం మండలం లేవిడి గ్రామంలోని రబ్బర్ తోటలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీరఘట్టం మండలం తూడి గ్రామంలో రైతులతో జరిగిన సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడుతూ, జీడిమామిడి పంట అమ్ముకునే సమయంలో…
