మార్కాపురంలో మహిళా దినోత్సవం – శక్తి యాప్ ప్రారంభించిన సీఎం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల స్టాళ్లను సందర్శించి, వారు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. మహిళలపై అఘాయిత్యాలు చేసిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు. మహిళలు ఆర్థికంగా స్వయంసాధికారులుగా…
