భాకరాపేటలో 32 ఎర్రచందనం దుంగలు పట్టివేత
తిరుపతి జిల్లా భాకరాపేట అటవీ ప్రాంతంలోని దేవరకొండ మెయిన్ రోడ్డు వద్ద 32 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. దీంతో మోటార్ సైకిల్, లగేజీ వాహనంతో ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలతో, డీఎస్పీ బాలిరెడ్డి మార్గదర్శకత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆర్ఐ సాయి గిరిధర్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ బృందం…
