అమలాపురంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలకు జిల్లా వైయస్సార్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. హైస్కూల్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ‘అమ్మ ఒడి’, ‘సూపర్ సిక్స్’ వంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా…
