A B.Tech student died by suicide near Madanapalle due to attendance shortage issues.

అటెండెన్స్ షార్టేజ్ వల్ల బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

అటెండెన్స్ షార్టేజ్ పేరుతో క్లాసులకు అనుమతి నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మదనపల్లె సమీపంలో జరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం సీటీఎం వద్ద మంగళవారం సాయంత్రం రైలు కింద పడి విద్యార్థి నందకుమార్ బలవన్మరణం చెందాడు. కదిరి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నందకుమార్ (18) కుప్పం నియోజకవర్గం వీకోట మండలం కే.నక్కనపల్లెకు చెందిన రైతు మంజునాథ కొడుకు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు…

Read More
Tribal farmers protested, demanding ₹200 per kg for cashew and government procurement through RBKs.

జీడిపిక్కలకు మద్దతు ధర ఇవ్వాలని గిరిజన రైతుల ఆందోళన

జీడిపిక్కలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మద్దతు ధరను నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గిరిజన రైతులు డిమాండ్ చేశారు. ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. వెంకన్న తెలిపారు. గురువారం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గర్సింగి పంచాయతీకి చెందిన గిరిజన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ, ప్రస్తుతం…

Read More
Devotee rush increases at Sri Lakshmi Narasimha Temple in Seethanagaram, with grand pujas being performed.

సీతానగరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని సీతానగరం గ్రామం సమీపంలో సువర్ణముఖి నది ఒడ్డున వెలసిన శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు కొనసాగుతున్నాయని ఆలయ పూజారి పీసపాటి శ్రీనివాసచార్యులు తెలిపారు. స్వామి వారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఆలయాన్ని పవిత్ర క్షేత్రంగా భావించి భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వామివారికి ముడుపులు సమర్పిస్తున్నారు. అనేక మంది భక్తులు దీక్షలు…

Read More
A grand festival was held at the newly built Bangaramma Temple in Ballakal village, Adoni Mandal.

బల్లకల్ గ్రామంలో బంగారమ్మ దేవాలయ మహోత్సవం ఘనంగా

కర్నూలు జిల్లా ఆదోని మండలం బల్లకల్ గ్రామంలో బంగారమ్మ అవ్వ కొత్త దేవాలయ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో కుల మతాలకు అతీతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. గ్రామస్థుల ఐక్యతకు ఇది చిహ్నంగా నిలిచింది. ఈ మహోత్సవంలో చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామమంతా ఉత్సాహంగా పాల్గొంది. దేవర మహోత్సవం సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆలయ నిర్మాణానికి మూడు లక్షల…

Read More
Police arrested four members of an inter-state gang involved in thefts at eight shops in Gajapathinagaram.

గజపతినగరంలో దొంగతనాలు – అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

విజయనగరం జిల్లా గజపతినగరంలో ఇటీవల జరిగిన దొంగతనాల కేసులో కీలక పురోగతి నమోదైంది. 8 షాపుల్లో చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్య బుధవారం ప్రకటించారు. గజపతినగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. అంతరాష్ట్ర ముఠాకు చెందిన గుల్లిపల్లి కిరణ్ కుమార్, రావుల రమణ, శ్రీను నాయక్, షేక్ బాషాలు గజపతినగరం పరిధిలోని వివిధ షాపుల్లో దొంగతనాలు చేసినట్లు పోలీసులు…

Read More
Collector Shyam Prasad urged everyone to take responsibility for Parvathipuram’s cleanliness.

స్వచ్ఛ సుందర పార్వతిపురం – కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపు

స్వచ్ఛ సుందర పార్వతిపురం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని ఆయన పేర్కొన్నారు. పార్వతిపురం పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ అలవాటుగా మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో బుధవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు,…

Read More
MLA Mamidi Govindarao alerted officials as four elephants roamed in Kotturu Mandal.

కొత్తూరు మండలంలో ఏనుగుల సంచారం – MLA అప్రమత్తం

కొత్తూరు మండలంలోని కడుము, హంస గ్రామ పరిసరాల్లో నాలుగు ఏనుగులు సంచరిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కడుము గ్రామ సమీపంలోని పొలాల్లో జొన్న పంటను ఈ ఏనుగులు నాశనం చేసిన విషయాన్ని స్థానిక రైతులు, గ్రామ నాయకులు MLA మామిడి గోవిందరావుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుంచి వెంటనే స్పందించిన శాసనసభ్యులు, పోలీస్, అటవీ, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు…

Read More