 
        
            ఏకపాత్రాభినయం పోటీలలో విద్యార్థుల అద్భుత ప్రదర్శన
మనోవికాసం లోక్ కళాకార్ దివస్ సందర్భంగా మార్చి 11, 12, 13 తేదీలలో చీరాల నియోజకవర్గంలో బాలల నైపుణ్యాల వర్క్ షాప్ నిర్వహించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ORS) లో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వం, చేతివ్రాత, ఏకపాత్రాభినయం వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించగా, మొత్తం 8 పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఏకపాత్రాభినయ పోటీలలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించిన బొడ్డు సంకేత్ కుమార్ (ORS స్కూల్, 5వ తరగతి) ప్రథమ…

 
         
         
         
         
        