 
        
            కడప లో స్కూటర్ ను ఢీకొన్న లారీ – మహిళ మృతి
కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగయపల్లె వద్ద తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరు పట్టణానికి చెందిన చలమయ్య లక్ష్మీదేవి పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న స్కూటర్‌ను వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంలో ముగ్గురు ప్రయాణిస్తుండగా, రెండు లారీల మధ్య ఇరుక్కుపోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా…

 
         
         
         
         
        