నిరుద్యోగ భృతి చెల్లించాలంటూ ఏఐవైఎఫ్ ధర్నా
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా గ్రీవెన్స్ సెల్ ముందు నిరుద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి 11 నెలలు పూర్తయినా నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం దారుణమని నాయకులు విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్, కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ యువతకు…
