సీతానగరంలో ఏనుగుల జోన్ వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళన
సీతానగరం మండలంలోని అప్పయ్యపేట, రేపటి వలస, తామర కండి, గుచ్చుమి గ్రామాల గిరిజనులు, సన్నచిన్న రైతులు కొండ పోరంబోకు స్థలాల్లో జీవిస్తున్నారు. ఇక్కడి భూముల్లో డి పట్టాలతో బ్రతుకుతున్న వారు ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫారెస్ట్ అధికారులు 1100 ఎకరాల కొండ ప్రాంతాన్ని ఏనుగుల జోన్‌గా ప్రకటించడం అన్యాయమని, ఇది గిరిజన గ్రామాలకు, చిన్న రైతులకు పెనుముప్పుగా మారుతుందని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవనాధారం కోల్పోయే స్థితికి గ్రామస్తులు చేరుకున్నారని, వెంటనే ఈ…
