మద్యం మత్తులో కుమారుడిని పొట్టన పెట్టుకున్న తండ్రి!
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కాశీం అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని చూసిన అతని కుమారుడు షాకీర్ తల్లి ప్రాణాలను రక్షించేందుకు అడ్డు వచ్చాడు. అవసర పరిస్థితుల్లో తండ్రి పట్టిన కత్తి కుమారుడికే తగలడంతో షాకీర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయాల కారణంగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తన కొడుకే తన చేతుల్లో ప్రాణాలు కోల్పోవడం…
