టీటీడీ లోపాలపై ఈవో శ్యామలరావు సంచలన వ్యాఖ్యలు
తిరుమల తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీటీడీ ఈవో జె. శ్యామలరావు, గత ఐదేళ్లలో టీటీడీలో అనేక అవకతవకలు, నిర్లక్ష్యం చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా గోశాల నిర్వహణ, ఐటీ విభాగం, కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా వివరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీలో వ్యవస్థల ప్రక్షాళన చర్యలు ప్రారంభించామన్నారు. గోశాలల్లో దుర్వ్యవస్థను గత ప్రభుత్వ హయాంలో జరిగినదిగా స్పష్టం చేశారు. గోవులకు నాచుపట్టిన నీరు, పురుగులతో ఉన్న దాణా ఇచ్చినట్లు, గడువు తీరిన…
