సీఎం చంద్రబాబు పంచాయతీ సమీక్ష: వ్యయం పెంపు, కొత్త యాప్
సీఎం చంద్రబాబు నేడు పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. వేడుకల వ్యయాన్ని రూ.10 వేల నుంచి 25 వేలకు పెంచినట్టు సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకువచ్చారు. మొబైల్ యాప్…
