ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అవినీతి గుట్టురట్టు!
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అడుగడుగునా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడట.. ఆసుపత్రికి మందులు, ఇతరత్రా వస్తువుల సప్లై కోసం పిలిచే కాంట్రాక్టుల్లో 20 శాతం కమీషన్ ఆయనకు ఇచ్చుకోవాల్సిందేనట. రోగులకు ఇంజెక్షన్ చేసిన సిరంజీలను ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ విషయంలోనూ అవినీతికి పాల్పడ్డాడట. అంతేనా, చివరకు అనాథ శవాలను అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడని సందీప్ ఘోష్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన అవినీతిపై విచారణ చేపట్టిన సిట్…
