
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి నివాసంలో కీలక భేటీ
ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి నివాసంలో నేడు బీజేపీ నేతల కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో బీజేపీని ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, ఇటీవలి ఎన్నికల్లో ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. వైసీపీ అరాచక పాలన వల్లే కూటమికి ఓట్లు వేశారని తెలిపారు. ఇక, అధినాయకత్వం పిలుపు ఇచ్చిన మేరకు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో…