పార్వతిపురం జిల్లాలో దుర్గా నవరాత్రుల ఘనపూజలు
పార్వతిపురం మన్యం జిల్లాలో గత రెండు రోజుల నుంచి శ్రీశ్రీశ్రీ దుర్గా భవాని పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ పూజలు సీతానగరం, పార్వతిపురం, బల్జిపేట మండలాల్లో కొనసాగుతున్నాయి. మండలంలోని పలు చోట్ల భక్తులు పెద్ద ఎత్తున హాజరై దుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దుర్గమ్మకు ప్రత్యేక అలంకారాలు, ఆవాహన హోమాలు నిర్వహించడం ద్వారా భక్తులు తమ భక్తిని ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఆసక్తిగా పాల్గొంటున్నారు….
