పైడితల్లి అమ్మవారి దర్శనానికి ప్రముఖుల తరలి రాక
శ్రీ పైడితల్లి అమ్మవారిని పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు మంగళవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ పూజారులు, అధికారులు అధికార లాంచనాలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి, ఇతర న్యాయమూర్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు….
