అమరావతిలో మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి మరోసారి కేంద్రంలోకి వచ్చింది. పునఃప్రారంభోత్సవ వేళ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కార్యక్రమానికి హాజరయ్యారు. కేరళ తిరువనంతపురంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమం అనంతరం ఆయన నేరుగా విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పాటు పలువురు మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. వెళ్లిన వెంటనే ప్రధాని భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ద్వారా అమరావతి రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి…
