ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులకు డ్రోన్ కేమరా పరిశీలన
ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించవలసిందిగా సంబంధిత అధికారులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు.శనివారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలసి ఇరిగేషన్, విద్యుత్ శాఖలపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులకు ఇప్పటికే 50 కోట్ల నిధులు మంజూరయ్యాయని, రెండు రోజుల్లో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు….
