
లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టు షాక్
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, గోవిందప్ప లు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వారి వాదనను కోర్టు ఖండించింది. ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోందని పేర్కొంటూ వెంటనే బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. గురువారం ఉదయం విచారణ చేపట్టిన ధర్మాసనం, “ఇప్పుడే నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు. హైకోర్టు…