ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు.. ప్రజల్లో ఆందోళన!
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు వైద్యశాఖ అధికారులు ధృవీకరించారు. ఉంగుటూరు మండలంలోని కోళ్ల ఫారం సమీపంలో నివసించే వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను వైరస్ ప్రభావం నుంచి రక్షించేందుకు ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న వారిని పరీక్షిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ తీవ్రత…
