Dr. BV Jayanageshwar Reddy inaugurated 2 new buses at Emmiganur RTC Depot, highlighting the government's commitment to improving transport services, including free travel for women.

ఎమ్మిగనూరులో 2 కొత్త ఆర్టీసీ బస్సుల ప్రారంభం

గత ప్రభుత్వం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు ఒక బస్సు కాదు.. ఒక టైరు కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులకు ఇబ్బందికరంగా లేకుండా 6 నెలలలో నాలుగు సార్లు 19 కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం, ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో 2 కొత్త బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

Read More
Sri Siddharood Swami’s centenary celebrations were held in Kosigi, with devotees participating in a grand procession and rituals. Thousands attended the event.

కోసిగి మండలంలో శ్రీ సిద్ధరూడ స్వామి శతమానోత్సవం

కోసిగా మండలంలోని శ్రీ సిద్ధరూడ స్వామి మహా చరిత్ర శతమానోత్సవం కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లిలోని మహాశివరాత్రి వేడుకలతో జరగింది. ఈ వేడుకలో 5000 మందికిపైగా భక్తులు హాజరై సద్వచనాలను వినడం జరిగింది. జగద్గురు శ్రీ సిద్ధరూడ స్వామి జయంతి ఉత్సవం సందర్బంగా చళాకాపురం నుండి బయలుదేరిన స్వామి, ఆంధ్ర, కర్ణాటక సిద్ధరూడ స్వామి మఠాలను సందర్శించి, శివరాత్రి రోజు హుబ్బళ్లి చేరుకున్నారు. ఈ కార్యక్రమం కోసిగా మండలంలోని శ్రీ సిద్ధరూడ శాంతాశ్రమం ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా…

Read More
Ex-MLA Prakash Jain urged the coalition government to focus on Adoni's development in 2025 and extended New Year wishes to all.

2025లో ఆదోని అభివృద్ధి కావాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్ష

కర్నూలు జిల్లా ఆదోనిలో 2024లో కూటమి ప్రభుత్వం గెలవడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నా, ఏడాది పూర్తయిన తరువాత కూడా అభివృద్ధి స్పష్టంగా కనిపించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. 2025వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, కూటమి ప్రభుత్వం ఆదోనిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని ప్రకాష్ జైన్ సూచించారు. ఇక్కడి ప్రజల అవసరాలకు సరైన ప్రాధాన్యత ఇచ్చి, వారికి మంచి సేవలు…

Read More
CPI's centenary celebrations continued on Day 2 with leaders hoisting party flags and emphasizing its historic fight for the underprivileged.

సిపిఐ శతదినోత్సవ వేడుకలలో పతాకావిష్కరణ

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతదినోత్సవం సందర్భంగా రెండవ రోజు వేడుకలు స్థానిక చదువుల రామయ్య నగరంలో మరియు కల్లుబావి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సిపిఐ సీనియర్ నాయకులు సామెలప్ప, మహిళా సమైక్య నాయకురాలు గోవిందమ్మ గారు పార్టీ పతాకాలను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలలో పార్టీ ప్రజాసంఘాల నాయకులు పాల్గొని, సిపిఐ పార్టీ గడిచిన 100 సంవత్సరాల చరిత్రను గౌరవించామని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ కార్యదర్శి సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే…

Read More
YSRCP leaders, led by Emmiganur constituency in-charge Butta Renuka, staged a protest against the hike in electricity charges, demanding a reduction in the increased rates.

ఎమ్మెలిగనూరులో విద్యుత్ చార్జీలపై వైసీపీ ఆందోళన

ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపుపై భారీ ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనను ఎమ్మెలిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్ట రేణుక నేతృత్వంలో వైసీపీ శ్రేణులు నిర్వహించారు. విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన ఈ ఆందోళనలో నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. బుట్ట రేణుక మాట్లాడుతూ, ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీలు పెంచవద్దని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇప్పుడు విద్యుత్ చార్జీలను పెంచినారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేంత వరకు వైసీపీ పోరాటం…

Read More
Under the orders of the Deputy Commissioner of Prohibition & Excise, illegal liquor worth ₹7 lakhs was destroyed by Emmiganur officials.

కర్నూలులో 1506 లీటర్ల అక్రమ మద్యం ధ్వంసం

కర్నూల్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారి ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి మరియు ఎమ్మిగనూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ మద్యం ధ్వంస కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు రోలర్ ద్వారా ఈ మద్యం ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధి, ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ పరిధి, పెద్ద కడుబూరు స్టేషన్ పరిధిలో నమోదైన 80 ఎక్సైజ్ నేరాలలో పట్టుబడిన 1506…

Read More
The Emmiganur Municipal Council meeting turned chaotic as ruling and opposition parties clashed over development funds and initiatives.

ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్‌ సమావేశంలో వాగ్వివాదం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం చైర్మన్ కేఎస్ రఘు అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చ జరగాల్సి ఉండగా, ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార పార్టీ మరియు ప్రతిపక్షం మధ్య వాగ్వాదం మొదలైంది. ఎమ్మిగనూరు పట్టణంలో అభివృద్ధి పనుల గురించి చర్చ సందర్భంగా అధికార పార్టీ వారు “మేము చేశాం” అని, ప్రతిపక్షం “మేము నిధులు ఇచ్చాము” అంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ వాగ్వాదం వల్ల సభలో గందరగోళ పరిస్థితి…

Read More