 
        
            కోసిగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రాయలసీమ డీఐజీ
కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన రికార్డుల తనిఖీ కూడా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ, కోసిగి, కౌతాళం పోలీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులను గమనిస్తూ, పోలీసులు నేరాల నియంత్రణలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు….

 
         
         
         
         
        