Excise officials seized and destroyed ₹12 lakh worth of illegal Karnataka liquor in Kosigi Mandal.

కోసిగి మండలంలో 12 లక్షల విలువైన మద్యం ధ్వంసం

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మద్యం స్వాధీనం చేసుకొని, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు. మొత్తం రూ.12 లక్షల విలువైన మద్యం నాశనం చేసినట్లు ఆయన తెలిపారు. కోసిగి, కౌతాళం పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా అక్రమ మద్యం రవాణా జరుగుతుందని సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ…

Read More
CCTV cameras are playing a key role in rural safety. A new CCTV store was inaugurated in Emmiganoor by the DSP.

నేర నియంత్రణకు సీసీ కెమెరాలు.. ఎమ్మిగనూరులో కొత్త దుకాణం

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మిగనూరు డీఎస్పీ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భద్రత పెంపు, ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఇవి బలమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య తగ్గుతుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా వాటిని తమ నివాసాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని కర్నూల్ బైపాస్ రోడ్‌లో కొత్త సీసీ కెమెరా దుకాణాన్ని డీఎస్పీ, టౌన్ సీఐ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ…

Read More
Bank employees in Adoni protested against govt. negligence and called for a two-day strike demanding recruitment, workload reduction, and reforms.

ఆదోనిలో బ్యాంకు ఉద్యోగుల నిరసన, సమ్మెకు పిలుపు

ఆదోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ఎదురుగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాంకు ఉద్యోగుల నిరసన కార్యక్రమం జరిగింది. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నేటి పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత లేకపోవడం, పెరిగిన పని ఒత్తిడి ఉద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు K రవికుమార్, R రాజశేఖర్, NCBE నాయకులు నాగరాజు, హరినాథ్, అనుమన్న…

Read More
Shashikala calls for a grand Women’s Day celebration in Adoni. Claims women thrived under Jagan’s rule, but coalition weakened schemes.

ఆదోనిలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని పిలుపు

కర్నూలు జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు శశికళ ఆదోని కేంద్రంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. బుధవారం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు వరద కళ్యాణి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె సూచించారు. మహిళలు సామాజిక, ఆర్థికంగా ఎదిగేందుకు జగనన్న ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు సంబంధించిన పథకాలను త్రుంగలో తొక్కారని శశికళ ఆరోపించారు. గత…

Read More
MLA Virupakshi questioned Chandrababu over inadequate welfare funds and the absence of free bus travel for women.

చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే విరుపాక్షి

సంక్షేమ పథకాలపై అరకొర నిధులు కేటాయించారని ఆలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరుపాక్షి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు అంటూ చెప్పిన చంద్రబాబు ఎక్కడ అనుసరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతీ మహిళకు రూ.1500 అందించాలన్న హామీ గాల్లో కలిసిందని అన్నారు. తల్లికి వందనం పథకం గురించి ఇప్పుడు మాట్లాడటం లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలను పార్టీ వర్గీకరణతో అమలు చేస్తున్నారని విరుపాక్షి ఆరోపించారు. సంక్షేమ పథకాలను అందరికీ సమానంగా అందించాలని, ఇది పార్టీలకు…

Read More
BJP leaders condemned the vandalism of their flagpole in Adoni, demanding strict action against the culprits.

ఆదోనిలో బీజేపీ జెండా ధ్వంసం, నిరసన వ్యక్తం చేసిన నేతలు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఐదవ వార్డ్ విజయనగర కాలనీలో బీజేపీ జెండా ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన జెండా పోల్ రాత్రికి రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బలపడుతున్నందునే ప్రతిపక్షాలు భయపడుతున్నాయని, దీనివెనుక కుట్ర ఉందని వారు ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు దీనిపై…

Read More
MLA BV Jay Nageshwar Reddy reviewed the arrangements for Shivaratri and Urs, ensuring all facilities for devotees.

ఎమ్మిగనూరులో శివరాత్రి, ఉరుసు ఏర్పాట్లపై సమీక్ష

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం గురుజాల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలు, గోనెగండ్ల మండలంలోని గంజహళ్లి గ్రామంలో హజరత్ మహాత్మా బడే సాహెబ్ ఉరుసు మహోత్సవం జరుగనున్నాయి. మార్చి 5న గంధం, మార్చి 6న ఉరుసు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులతో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో త్రాగునీరు, శానిటేషన్, విద్యుత్…

Read More