 
        
            అక్రమ ఆక్వా చెరువులపై పోరాటం చేసిన యువకుడిపై దాడి
ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో న్యాయ పోరాటం చేస్తూ పర్యావరణ రక్షణకు కృషి చేసిన యువకుడిపై దారుణం జరిగింది. గ్రామానికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై నిరసన వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. ఆక్వా చెరువుల వల్ల పర్యావరణ కాలుష్యం మరియు నీటి నాశనం జరుగుతుందని కోర్టులో ఫిర్యాదు చేయడంతో, కోర్టు చెరువులను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోని కొందరు ఆక్వా రైతులు చెరువుల…

 
         
         
         
         
        