అంతర్వేదిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా
సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ యువత ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాజీ మహారాజ్ పోరాట గాధను గుర్తు చేసుకుంటూ అతని సేవలను కొనియాడారు. జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, మహారాజ్ త్యాగం, ధైర్యాన్ని యువతకు తెలియజేశారు. యువత అధ్యక్షుడు బైర నాగరాజు మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ దేశభక్తి, పరాక్రమం ప్రతి…
