Lab Technician Day was grandly celebrated in Amalapuram, where doctors praised the invaluable services of lab technicians.

ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు అమలాపురంలో ఘనంగా

ల్యాబ్ టెక్నీషియన్ సేవలు అనితరసాధ్యమైనవని పలువురు వైద్యులు కొనియాడారు. ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు కె.ఎం.ఎల్.ఆర్.టి ఆధ్వర్యంలో అమలాపురం వై.టి నాయుడు స్కానింగ్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్‌ల సేవలను గుర్తించాలంటూ పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఐఎంఈ ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్, సెక్రటరీ డాక్టర్ వై.టి నాయుడు మాట్లాడుతూ, ల్యాబ్ టెక్నీషియన్‌ల ద్వారా అందించబడే రిపోర్ట్ ద్వారానే వైద్యం నిర్ణయించబడుతుందని తెలిపారు. రోగుల వ్యాధిని…

Read More
Dolotsavam was celebrated with devotion at Sri Lakshmi Narasimha Swamy Temple in Antarvedi.

అంతర్వేదిలో డోలా పూర్ణిమ డోలోత్సవం వైభవంగా నిర్వహింపు

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ పరిధిలో గల నాలుగు కాళ్ల మండపంలో డోలా పూర్ణిమ నాడు డోలోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి మహిమను స్మరిస్తూ ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరిపారు. ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. డోలోత్సవాన్ని గత 50 సంవత్సరాలుగా దూశనపూడి గ్రామానికి చెందిన చేన్ను సాంభశివరావు కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నారు. నరసింహుని కుమారుడు పరమేశుని మూడవ నేత్రంతో భస్మమైన తర్వాత రెండవ రోజున…

Read More
Officials investigated allegations against Mulikipalli Sarpanch and will submit a report to the Amalapuram DPO.

ములికిపల్లి సర్పంచ్‌పై ఆరోపణలపై అధికారుల విచారణ

రాజోలు మండలం ములికిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌పై కొందరు వార్డు మెంబర్లు, స్థానికులు పలు ఆరోపణలు చేస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనులలో అవకతవకలు, పాలనలో లోపాలు ఉన్నాయని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం డిపిఒ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. రాజోలు, సఖినేటిపల్లి EOPR & RDలు ఫిర్యాదు దారుల సమక్షంలో 12 ప్రధాన అంశాలపై విచారణ నిర్వహించారు. గ్రామస్థుల నుంచి అభిప్రాయాలను సేకరించి, సర్పంచ్‌ తీరుపై సమగ్ర విశ్లేషణ…

Read More
A YSRCP Formation Day rally was held in Amalapuram, where leaders criticized the government for failing to implement its promises.

అమలాపురంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలకు జిల్లా వైయస్సార్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. హైస్కూల్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ‘అమ్మ ఒడి’, ‘సూపర్ సిక్స్’ వంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా…

Read More
VHP protested demanding the suspension of the CI for allegedly targeting Hindus. They submitted a petition at the Collector’s office.

సీఐ సస్పెన్షన్ డిమాండ్.. విశ్వహిందూ పరిషత్ ర్యాలీ

రాళ్లతో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా హిందువులపై కేసులు పెట్టిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల వంతెన నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వీహెచ్‌పీ కార్యకర్తలు నినాదాలతో ఊరేగారు. కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసన తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండటంతో, కలెక్టర్ కాన్వాయ్ వచ్చిన వెంటనే పోలీసులు…

Read More
Devotees express anger after Pedditlamma temple remains locked due to committee disputes during the festival.

పెద్దిట్లమ్మ ఆలయానికి తాళం.. భక్తుల ఆగ్రహం

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ పెద్దిట్లమ్మ అమ్మవారి ఆలయంలో విభేదాలు భక్తులకు తీవ్ర నిరాశ కలిగించాయి. ఆలయానికి సంబంధించిన పాత కమిటీ సభ్యులు తాళం వేసి వెళ్లిపోవడంతో భక్తులు దర్శనం పొందలేకపోయారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు కొనసాగుతున్నా, ఆలయం మూసివేయడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి జాతరకు తరలివచ్చారు. అయితే, ఆలయ తలుపులు మూసివుండటంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం…

Read More
Prohibited Liquor and Illicit Liquor Destroyed in Konaseema

కోనసీమలో నిషేధిత మద్యం, సారాయి ధ్వంసం

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎస్పీ ఆదేశాలతో నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్న నిషేధిత మద్యం, సారాయిని ధ్వంసం చేశారు. రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నమోదైన 296 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 11,687 మద్యం సీసాలు, 1944.50 లీటర్ల సారాయిని నాశనం చేశారు. డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, కాకినాడ వారి ఉత్తర్వుల మేరకు ఈ చర్య చేపట్టారు. శ్రీ జి. అమర్ బాబు, అసిస్టెంట్…

Read More