అయినవిల్లిలో జనసేనలో ఘర్షణ – అధ్యక్షుడి అరెస్ట్
అయినవిల్లిలో జనసేన పార్టీ అంతర్గత విభేదాలు ఉద్రిక్తంగా మారాయి. మునుపటి గొడవల నేపథ్యంలో జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, నాయకుడు తొలేటి ఉమపై అర్ధరాత్రి దాడికి దిగాడు. ఉమ ఇంట్లోకి చొరబడి పలువురితో కలిసి కర్రలతో దాడి చేశాడని బాధితులు తెలిపారు. ఈ దాడిలో ఉమకు తలపై బలంగా గాయమై, అతని భార్య కూడా గాయపడ్డారు. వెంటనే అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో ఉమ అనుచరులు తీవ్రంగా స్పందించి, రాజేష్…
