కోనసీమలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఆరుగురి దుర్మరణం
కోనసీమ, అక్టోబర్ 8:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదం స్థానికులను విషాదంలో ముంచేసింది. బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా సంభవించిన భారీ పేలుడు (Explosion in Fireworks Factory) భయానక దృశ్యాలను సృష్టించింది. ఈ పేలుడు అంత తీవ్రంగా జరిగిందంటే, దూరం వరకూ గర్జన వినిపించడమే కాకుండా, మంటలు ఆకాశాన్ని తాకాయి. ప్రమాదం సంభవించిన సమయానికి ఫ్యాక్టరీలో పది మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది….
