ఉపాధిహామీ కూలీల వేతనాలపై ఆవేదన వ్యక్తం చేసిన నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధిహామీ కూలీలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పిఠాపురం మండలం నవకొండవరం గ్రామంలో ఉపాధిహామీ పనుల పరిశీలన సందర్భంగా ఆయన కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేసిన పనులకు జనవరి నెల నుంచి వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఉపాధిహామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినా కూలీలు కనీసం…
