
మంగళగిరి యువకులపై 5 లక్షల బైండోవర్ చర్య
మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో వివాహితపై దురుసుగా ప్రవర్తించిన ఘటన నేపథ్యంలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, ఒకరు మరొకరిపై దాడి చేయడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటనలో సంబంధిత యువకులపై మండల ఎమ్మార్వో వద్ద 5 లక్షల రూపాయల బైండోవర్ చేయడం జరిగింది. ఎవరూ ఇటువంటి గొడవలకు పాల్పడకూడదని, శాంతి భద్రతలకు…