పశ్చిమగోదావరిలో కోళ్లను కాటేస్తున్న అంతుచిక్కని వైరస్
పశ్చిమగోదావరి జిల్లాలో కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్ రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారేసరికి చనిపోతున్న దారుణ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పందేలు కోసం పెంచిన కోళ్లు ఈ వైరస్ బారిన పడడంతో పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ వైరస్ నాలుగేళ్ల క్రితం కూడా పశ్చిమగోదావరి జిల్లాను భయపెట్టింది. అప్పట్లో కోళ్ల మరణాల కారణంగా మార్కెట్‌లో అమ్మకాలు…
