కుప్పం ఎన్నికలపై తప్పుడు ప్రచారంపై టిడిపి నేతల ఆవేదన
కుప్పం పురపాలక సంఘం ఎన్నికలలో గెలుపోటములు సహజమని, అయితే ఓడినవారు గెలిచినవారి వద్ద డబ్బు తీసుకున్నారని ప్రచారం చేయడం బాధాకరమని టిడిపి సీనియర్ నాయకులు గోపీనాథ్, డాక్టర్ సుధీర్ అన్నారు. కుప్పం పట్టణంలో జరిగిన టిడిపి సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. గోపీనాథ్ మాట్లాడుతూ, 16వ వార్డు పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన కుమారుడు హర్ష ధర్మతేజ టిడిపి తరపున పోటీ చేయగా, వైసిపి అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ పోటీ చేశారని చెప్పారు. అయితే తాను…
