అటెండెన్స్ షార్టేజ్ వల్ల బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
అటెండెన్స్ షార్టేజ్ పేరుతో క్లాసులకు అనుమతి నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మదనపల్లె సమీపంలో జరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం సీటీఎం వద్ద మంగళవారం సాయంత్రం రైలు కింద పడి విద్యార్థి నందకుమార్ బలవన్మరణం చెందాడు. కదిరి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నందకుమార్ (18) కుప్పం నియోజకవర్గం వీకోట మండలం కే.నక్కనపల్లెకు చెందిన రైతు మంజునాథ కొడుకు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు…
