హెల్మెట్ వినియోగంపై అవగాహనకు నక్కపల్లిలో బైక్ ర్యాలీ
నక్కపల్లి మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించే ప్రాముఖ్యతపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నర్సీపట్నం డిఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. పోలీసులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డు, వెదుళ్లపాలెం జంక్షన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, బైక్ ప్రమాదాల్లో 90 శాతం మరణాలు…
