పెదగరువు గిరిజన గ్రామానికి మంచినీటి కోసం పోరాటం
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీకి చెందిన పెదగరువు PVTG ఆదివాసి గిరిజన గ్రామస్తులు మంచినీటి సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. 13 కుటుంబాలు, 60 మంది జనాభా కలిగిన ఈ గ్రామానికి తాగునీటి సౌకర్యం లేకపోవడంతో, కొండ దిగుతూ గడ్డలో షెలము తీసుకొని నీటిని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెవిన్యూ రికార్డుల్లో గ్రామం లేకపోవడంతో మంచినీటి స్కీమ్‌లకు వీలుకాదని అధికారులు చెప్పడం బాధాకరమని గిరిజనులు తెలిపారు. 2019లో గ్రామస్తులు స్వయంగా శ్రమదానం చేసి 40 అడుగుల…
