వీ మాడుగుల గిరిజన గ్రామాల్లో రోడ్ల కోసం ఆందోళన
విజయనగరం జిల్లా వీ మాడుగుల మండలంలోని గిరిజన గ్రామాల ప్రజలు రోడ్ల నిర్మాణానికి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తాడివలస, గోప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కోత్తవలస, మామిడిపాలెం గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాలని వందలాది మంది గిరిజనులు, మహిళలు నిరసన చేపట్టారు. ఇప్పటికే ఎన్నికల ముందు రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.9.30 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు,…
