స్పీకర్ అయ్యన్నపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై వైసీపీ నేత, బిల్డింగ్ యజమాని తమ్ముడు కర్రి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నన్ను చంపేయండి లేదా మిమ్మల్ని చంపేస్తాను” అంటూ స్పీకర్‌ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో మాట్లాడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నర్సీపట్నంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వివాదం స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సంబంధించిన భవనం వ్యవహారంలో చోటుచేసుకుంది. ఆ భవనాన్ని ఖాళీ చేయాలని కోరినప్పటికీ, స్పీకర్ వారి పక్షాన సహకరించలేదని కర్రి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన…
