ఏజన్సీలో 48 గంటల బంద్, ఆదివాసీల నిరసన కొనసాగు
ఏజన్సీలో రాజవొమ్మంగి మండల వ్యాప్తంగా 48 గంటల నిరవధిక బంద్ కొనసాగుతోంది. 1/70 చట్ట పరిరక్షణ డిమాండ్‌తో ఆదివాసీలు, వామపక్షాలు నిరసనకు దిగారు. ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. బంద్‌లో భాగంగా వ్యాపార సంస్థలు, మీ సేవా కేంద్రాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు బంద్‌కు పూర్తి మద్దతు తెలిపినట్లు కనిపిస్తోంది. రవాణా సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బంద్ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు…
