ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్, బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీరసూర్యచంద్ర, జనసైనికులు, అభిమానులకు సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం నర్సీపట్నంలోని కృష్ణాపేలస్‌లో సభ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాజాన వీరసూర్యచంద్ర మాట్లాడుతూ, జనసేన 2014లో పవన్ కళ్యాణ్ స్థాపించినప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, నిబద్ధతతో ముందుకు సాగిందన్నారు. సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయానంతరం నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకువెళ్తోందని వివరించారు. సభ ఏర్పాట్లు న భూతో న భవిష్యత్ అన్నట్లు జరుగుతున్నాయని, అత్యంత గొప్ప స్థాయిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
జనసేన పార్టీ శాశ్వతంగా ప్రజల కోసం పనిచేస్తుందని, ఎప్పుడూ రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ వ్యవహరించలేదని రాజాన వీరసూర్యచంద్ర అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పవన్ కళ్యాణ్ ముఖ్య లక్ష్యమని, ఆయన నైతిక విలువలకు కట్టుబడి ముందుకు సాగుతున్నారని చెప్పారు. మానవత్వం, నిజాయితీతో కూడిన రాజకీయం చేయడమే జనసేన ధ్యేయమని వివరించారు.
అందుకే, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం జనసేన భవిష్యత్తు రాజకీయ దిశను సూచించే చారిత్రక సభగా నిలిచేలా అందరూ కలసికట్టుగా కృషి చేయాలని ఆయన కోరారు.
