ఉత్తరాంధ్ర చెరువులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. చెరువులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటేనే భవిష్యత్తులో వాటి విలువ తెలుస్తుందని ఆయన అన్నారు. కలుషిత నీరు చెరువుల్లో కలవకుండా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
సమితి సభ్యుడు మరిచర్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలని పేర్కొన్నారు. చెరువుల పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని సమాజంలోని ప్రతిఒక్కరికీ పిలుపునిచ్చారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వ సహకారం అవసరమని చెప్పారు.
ఐ. గోపాల్ రావు మాట్లాడుతూ చెరువులను కాపాడటం మన కర్తవ్యం మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు మనం ఇవ్వగల ఏకైక సహజ వనరని తెలిపారు. చెరువులు పాడైపోవడం వలన సారవంతమైన భూములు ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సభ్యుడు బలగా శంకరరావు రేపు జరగబోయే కార్యక్రమంలో అందరూ సమిష్టిగా పాల్గొని, చెరువుల పరిరక్షణకు మద్దతు ఇవ్వాలని కోరారు. సమితి పునరుద్ధరణ పనుల విజయాన్ని సాధించేందుకు గ్రామస్థులు, అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు.
very interesting details you have remarked, thanks for posting.