పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివారులోని మారుతి నగర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఆదిలక్ష్మి (30) అనే మహిళను హత్య చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఆర్థిక లావాదేవీల నేపథ్యంతో, ఆదిలక్ష్మి సహజీవనం చేస్తున్న కొండ అనే వ్యక్తి హత్య చేసి ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఆమె మృతదేహాన్ని క్వారీ గుంతలో పడేశాడని భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు హత్యకు గల అసలు కారణాలపై తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

 
				 
				
			 
				
			 
				
			