మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో మంత్రాల నెపంతో ఓ మహిళను చితకబాదిన సంఘటన మరువకముందే ఇదే మండలం కాట్రియాల గ్రామంలో అర్థరాత్రి దారుణంచోటుచేసుకుంది.
కాట్రియాల గ్రామానికి చెందిన డేగల ముత్తవ్వ(50) మంత్రాలు చేస్తుందన్న నెపంతో ఇంటి పక్కన వారు గ్రామస్తులు కొందరు చితక బాది పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఆమె కొడుకు కోడలు కళ్ళముందే జరిగిన ఎంత అరిసిన చుట్టుపక్కల వారు రాలేరని తమ పాలోలే ఈ ఘటనకు పాల్పడ్డారని కుమారుడు రవి తెలిపారు ఘటన స్థలానికి చేరుకున్న తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి,రామాయంపేట సిఐ వెంకట రాజగౌడ్ తీవ్రగాయాల పాలైన డేగల ముత్తవ్వ(50)ను వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.
మృతదేహాన్ని రామాయంపేట ఆసుపత్రికి తరలించినారు.
మంత్రాల నెపంతో మహిళపై దారుణ దాడి
In Medak district, a woman was brutally attacked and set on fire by villagers in Kaatriyal village, accused of practicing witchcraft.
