తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు ఇతరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ-రేస్ కేసులో అనాలోచిత చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని వారు అన్నారు. ఈ చర్యల వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని, కాబట్టి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “గత ప్రభుత్వం చేసిన మంచి పనులను ఈ ముఖ్యమంత్రి ముందుకు తీసుకువెళ్లాలి. కానీ, ఆయన ఈ పనులను ముందుకు తీసుకువెళ్ళకుండా నిధులను వృథా చేయడం వల్ల ఇప్పుడు ఆయన నిందితుడిగా మారారని” విమర్శించారు.
ప్రవీణ్ కుమార్ మరింత వివరించి, “ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ కార్యక్రమం ప్రజలందరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కానీ, సీఎం రేవంత్ రెడ్డి చర్యల వల్ల ఈ రేస్ ద్వారా తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు.”
ఫార్ములా ఈ-రేస్ హైదరాబాద్‌లో జరిగితే, యావత్ భారత్ తెలంగాణ వైపు చూసింది, అక్కడి ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని ఎంటర్‌టైన్‌గా స్వీకరించారు, కానీ ప్రభుత్వ దృష్టి తప్పడం వల్ల ఈ అవకాశాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
