హైదరాబాద్‌లోని టీ హబ్‌లో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు బ్రెయిన్ ట్యాప్ అనే అత్యాధునిక మెదడు ఫిట్‌నెస్ టెక్నాలజీని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కజకిస్తాన్ గౌరవ కాన్సుల్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ ప్రారంభించారు. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, మెదడు పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించిన ఈ టెక్నాలజీపై అక్కడికి హాజరైన అతిథులు ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో బ్రెయిన్ ట్యాప్ వ్యవస్థాపకుడు, సహ సీఈఓ డాక్టర్ పాట్రిక్ పోర్టర్, సహ వ్యవస్థాపకురాలు, సీఎంఓ సింథియా పోర్టర్, బోర్డ్ డైరెక్టర్ విషాల్ బైజాల్, చీఫ్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ ఫ్రాన్సిస్కో సిడ్రల్, నిర్వాణ న్యూరో ప్రైవేట్ లిమిటెడ్ సీఓఓ ఛయాల్ బైజాల్, బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ హర్షిల్ మౌన్ పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఐపీఎస్, తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా, ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ సుభద్రా జలాలి, అపోలో హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఆశిష్ చౌహాన్ తదితరులు హాజరై బ్రెయిన్ ట్యాప్ టెక్నాలజీపై ప్రశంసలు కురిపించారు.
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని విశిష్ట అతిథులు పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్తులో ఇది మరింత విస్తృతంగా వినియోగించబడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
